పిఠాపురంలో నామినేషన్ వేసిన పవన్ .. జనసేనాని ఆస్తులు, అప్పుల చిట్టా ఇదే

 



ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలులోని నివాసం నుంచి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు ఆయన భారీ ర్యాలీగా వెళ్లారు. అనంతరం ఆర్వో కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. పవన్ కళ్యాణ్ వెంట టీడీపీ నేత వర్మ, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు తదితరులు వున్నారు.

Also Read : ఓటు ఫ్రమ్ హోమ్ : అర్హులెవరు, దరఖాస్తు ఎలా, ఓటు ఎలా వేయాలి..?

ఇదిలావుండగా.. పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్‌లో గడిచిన ఐదేళ్లలో రూ.114,76,78,300 కోట్లుగా పేర్కొన్నారు. అలాగే ఆదాయపు పన్నుగా రూ.47,07,32,875.. జీఎస్టీ కింద రూ.26,84,70,000 చెల్లించినట్లుగా తెలిపారు. అలాగే తనకు రూ.64,26,84,453 అప్పులుగా పేర్కొన్నారు. ఇందులో బ్యాంకుల నుంచి రూ.17,56,84,453 కోట్లు.. వ్యక్తుల నుంచి రూ.46.70 కోట్లు అని వివరించారు. 

అలాగే పలు విద్యాసంస్థలు, జనసేన సేవా కార్యక్రమాలకు రూ.17,15,00,000 విరాళాలు అందజేసినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. వివిధ సంస్థలకు 3,32,11,717 కోట్లు.. కేంద్రీయ సైనిక్ బోర్డుకు రూ. కోటి, పీఎం సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఫండ్‌కు రూ. కోటి, ఏపీ తెలంగాణ సీఎం సహాయ నిధులకు చెరో రూ.50 లక్షలు , శ్రీరామ జన్మభూమి తీర్ధ్ క్షేత్ర ట్రస్ట్‌కు రూ.30,11,717 లక్షలు , పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్‌కు రెండు లక్షల రూపాయలు విరాళంగా అందించినట్లు వెల్లడించారు. 


Comments